మండల కేంద్రంలో విద్యుత్ దీపాల ఏర్పాటు

08-10-2026 | 05:10am

కోటపల్లి, అక్టోబర్ 7 : మంచిర్యాల జిల్లా(Mancherial District) కోటపల్లి మండల కేంద్రంలో వెలుగుని విద్యుత్ దీపాల మీద ఈ నెల 6న ‘పొద్దుగూగితే చిమ్మ చీకటే... అలంకారప్రాయంగా విద్యుత్ దీపాలు(Electric lights) - అవస్థలు పడుతున్న మండల కేంద్ర వాసులు‘ పేరిట ప్రచురితమైన కథనానికి ఎట్టకేలకు సంబంధిత శాఖ అధికారులు స్పందించారు. మండల కేంద్రంలోనీ ప్రధాన రహదారిపై సుమారు 30 వరకు, లోపలి వీధుల్లో సుమారు 60 వరకు విద్యుత్ దీపాలను పంచాయతీ కార్యదర్శి జగదీష్ సిబ్బందితో అమర్చారు.

పాత విద్యుత్ దీపాల మరమ్మత్తు ఆలస్యమవుతుండటంతో 90 విద్యుత్ దీపాలను(Electric lights) కొనుగోలు చేసి అమర్చుతున్నారు. మండల కేంద్రంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తుండటంతో ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమవుతోంది. నిన్న మొన్నటి వరకు అరకొర విద్యుత్ దీపాలతో ప్రధాన వీధులు, ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాలు చీకటిమయంగా మారాయని, ప్రస్తుతం వెలుతురులో ఆనందంగా బతుకమ్మ ఆడుకోవచ్చునని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు