వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
దుర్గ మాత సన్నిధిలో అన్నదానం
కోదాడ,(విజయక్రాంతి): గుడిబండ గ్రామంలో పదోవ వార్డు గట్టు బజార్ నవరాత్రి ఉత్సవాల(Navratri celebrations) సందర్భంగా సద్దుల బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తుల కోలాహలం, మహిళల బతుకమ్మ ఆటపాటలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ మండల అధ్యక్షులు తూమాటి వరప్రసాద్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇర్ల నరసింహారెడ్డి, కుక్కడపు సైదులు, గుండు వీరబాబు, విగ్రహ దాత వెరమల రోజా రవి లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు దుర్గ మాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవీ నవరాత్రుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అన్న ప్రసాద(Annadanam program) వితరణ అన్నదాన కార్యక్రమా న్ని ముఖ్య అతిథులుగా రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ(Bathukamma Celebrated) ప్రతీక అని అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఎండి. రఫీ, పి. వెంకటేశ్వర్లు, ఎం. సైదులు, జి. వెంకటేష్, జి. సైదులు, కె. వీరబాబు, బి.సిద్దయ్య, మరియు ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు.