ఘనంగా కుంకుమార్చన పూజలు
నస్పూర్, (విజయక్రాంతి ): మంచిర్యాల కార్పొరేషన్ (Mancherial Corporation)పరిధిలోని నస్పూర్ సింగరేణి రిటైర్డ్ కాలనీలోని (Singareni Retired Employees' Colony)శ్రీశ్రీ లక్ష్మీ గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్ర వారం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి, అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ కుంకుమార్చన గావించారు.
అనంతరం స్వామివారికి నైవేద్యాలు సమర్పించి మహాహారతి ఇచ్చారు. పూజల అనంతరం నాంపల్లి తిరుపతి, గాండ్ల సుధీర్ భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, నిర్వాహకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో మండలి నిర్వాహకులు మేడం తిరుపతి, ఎంబడి సమ్మయ్య, కనవేని ఓదెలు, రామంచ సంపత్, ఆంజనేయ ప్రసాద్, ముష్కే రవి, కాలనీ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.