పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన సమాజం

18-09-2026 | 03:59pm

- సులానగర్‌లో పోషణ మాస కార్యక్రమం

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం సులానగర్ గ్రామపంచాయతీ(Sulanagar Gram Panchayat) పరిధిలో పోషణ మాసం సందర్భంగా శుక్రవారం పోషణ మాస కార్యక్రమాన్ని(Nutrition Month program) నిర్వహించారు. కార్యక్రమానికి తల్లిదండ్రులు, గర్భిణీలు, బాలింతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన సమతుల్య పోషకాహారంపై అవగాహన కల్పించారు.

బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి తొలి వెయ్యి రోజుల వరకు ఎంతో కీలకమని, ఈ సమయంలోనే శిశువు మెదడు అభివృద్ధి వేగంగా జరుగుతుందని వివరించారు. తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలు లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మానాయక్, ఉప సర్పంచ్ ఉండేటి చెన్నయ్య, టేకులపల్లి సీడీపీవో, సూపర్‌వైజర్, కాంప్లెక్స్ హెచ్‌ఎం, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు