అన్నదాతలు సంతోషంగా ఉండాలన్నదే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యం....
- కరెంటు లేకపోతే మీ విజ్జనకు ఫోన్ చేయండి....
- రైతులకు సబ్సిడీ విత్తనాలు అందజేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు.....
సుల్తానాబాద్, నవంబర్ 4 (విజయ క్రాంతి): అన్నదాతలు సంతోషంగా ఉండాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(MLA Vijay Ramanarao) అన్నారు, బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 50 శాతం సబ్సిడీపై మొక్కజొన్న ,
100 శాతం సబ్సిడీపై తెల్ల జొన్న విత్తనాలు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సహకారంతో ఎమ్మెల్యే విజయ రమణారావు చేతుల మీదుగా రైతులకు అందజేయడం జరిగింది, ఈ సందర్భంగా జరిగిన సమావేశం లో ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్ ఎలినినో కారణంగా రైతులు ఆరుతడి పంటలు వేయాలని అన్నారు, 12 గంటలు కరెంటు సరఫరా ఉంటుందని, కరెంటు లేకపోతే మీ విజన్నకు ఫోన్ చేయండి అని అన్నారు.
ఏలినోనో కరువు ప్రభావం పై కొంతమంది రాజకీయం చేయడం సరైనది కాదన్నారు, కాలేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందన్నారు, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ అధికారులు చెప్పిన పంటలే రైతులు వేసుకోవాలన్నారు, పెద్దపల్లి నియోజకవర్గంలో త్వరలో నే లక్ష మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మాణం చేసుకోవడం జరుగుతుందని విజయ రమణారావు అన్నారు.
ఈ సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ , జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మండల వ్యవసాయ శాఖ అధికారి పైడితల్లి , సింగిల్ విండో చైర్మన్లు చిలుక సతీష్, కల్లేపల్లి జానీ , సీఈ ఓ బురుగు సంతోష్ కుమార్ , నాయకులు దామోదర్ రావు, సాయిరి మహేందర్ , ముస్త్యాల రవీందర్ , ఆయా గ్రామాల సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు..