నాగారం లో విబిజీ రాంజీ ఉపాధి పనుల పరిశీలన
జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఎంపీడీఓ శ్రీనివాసరావు
దేవరకద్ర నవంబర్ 4 విజయ క్రాంతి: 4,మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారం గ్రామంలో బుధవారం రోజు జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఎంపీడీఓ శ్రీనివాసరావు పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న విబిజీ రాంజీ ఉపాధి హామీ(VBG Ramji Employment Guarantee) పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఉపాధి పనుల పురోగతి, పనుల నిర్వహణ, కూలీల హాజరు తదితర అంశాలను బుధవారం నాడు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని, కూలీలకు ఉపాధి కల్పించే విషయంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనుల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉపాధి కూలీలు పాల్గొన్నారు.