బాలుడిపై దాడి.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్
కోయిలకొండ, అక్టోబర్ 7 : మండలంలోని మల్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో(Mallapur Primary School) విద్యార్థిపై దాడి ఘటనకు సంబంధించి ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయుడు పి. బనాదేశ్ను(LFL Headmaster P. Banadesh) అధికారులు సస్పెండ్ చేస్తూ డీఈఓ విజయ లక్ష్మి(DEO Vijaya Lakshmi) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై కోయిలకొండ ఎంఈఓ, ఎంపీడీఓ మల్లాపూర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థి, తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సంబంధిత ఉపాధ్యాయుడికి కారణాలు చూపాలంటూ నోటీసు జారీ చేసి వివరణ తీసుకున్నారు. ఈ మేరకు విచారణ నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి సమర్పించారు. నివేదిక ఆధారంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలతో పి. బనాదేశ్ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఎంఈఓ తెలిపారు.