బెయిల్‌పై విడుదలైన నేతలకు మహేష్‌రెడ్డి పరామర్శ

29-10-2026 | 04:49pm

గండీడ్ (విజయక్రాంతి): జంగంరెడ్డిపల్లి గ్రామ బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీనుతో పాటు ఆయన సోదరుడు హన్మంత్‌ బెయిల్‌పై (Bail) విడుదలైన నేపథ్యంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా మహేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా పాలన అందించాల్సిన కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ నాయకులపై అక్రమ కేసులు (Illegal Cases) బనాయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకులు కేసులు నమోదు చేయించి వారిని రిమాండ్‌కు (Remand) పంపించారని విమర్శించారు.

రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకులు ఆచితూచి వ్యవహరించాలని మహేష్‌రెడ్డి హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో దోమ మాజీ జెడ్పీటీసీ నాగిరెడ్డి, పెద్ద వెంకట్‌రెడ్డి, మహేష్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ హనుమంతు, శీలం పెంటయ్య, ఎం. బాలు, కే. వెంకటయ్య, కే. లాలు, ఎస్. శ్రీనివాస్, హన్మయ్య తదితర బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు