భక్తిశ్రద్ధలతో చండీ హోమం..
19-10-2026 | 08:33pm
రాజాపూర్ అక్టోబర్ 19: గ్రామ ప్రజల శ్రేయస్సు కోసమే చండీ హోమం నిర్వహించినట్లు తిరుమలాపూర్ గ్రామ సర్పంచ్ సంతోష వెంకటేష్ తెలిపారు. సోమవారం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో భ్రమరాంబ దేవిని దుర్గాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ శ్రేయస్సు కోసం వేద పండితులు నరసింహమూర్తి ఆధ్వర్యంలో చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామచందర్ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.