ఆపదలో సర్పంచ్ అండ.. కుటుంబాలకు చేయూత!
నంగునూరు, (విజయక్రాంతి): నంగునూరు మండలం కొండంరాజుపల్లి గ్రామానికి చెందిన చిరబోయిన రాజవ్వ, ఎర్ర రామవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. నిరుపేద కుటుంబాలు కావడంతో గ్రామ సర్పంచ్ సిలువని అరుణబాయి స్పందించి.. మృతుల కుటుంబాలకు చేరో 50 కిలోల చొప్పున బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అరుణబాయి మాట్లాడుతూ.. తన వంతు సహాయంగా నిరుపేద కుటుంబాలకు బియ్యం పంపిణీ(Biyyam Distribution) చేస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మమత మల్లేశం, వార్డు సభ్యులు సిలువని శ్రీను, ఇస్కిల్ల అనిల్, వడితం పరుశురాములు, గర్నపల్లి మల్లేశం, గ్రామస్తులు పిట్టల చిన్న కనకయ్య, బాగు తిరుపతి, గొడుగు మల్లేశం, బాగు ఐలయ్య, కనకరెడ్డి, పిట్టల కృష్ణ, బాగు సంపత్, గుళ్ల రాజు, చిరబోయిన కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.