ఇంట్లో ఏసీ పేలి అగ్నిప్రమాదం
నెల్లూరు: ఇంట్లో ఏసీ పేలడంతో అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించిన ఘటన నెల్లూరు(Nellore)లో కలకలం రేపింది. పత్తేఖాన్పేట రైతుబజార్ వెనుక ఉన్న ఓ నివాసంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న తంజావూరుకు చెందిన శారదమ్మ (75) గాయపడ్డారు. ఏసీ పేలిన(AC Blast) అనంతరం ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై ఇంట్లో చిక్కుకున్న వృద్ధురాలిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)కు తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.