ములుగులో ‘ప్యారడైజ్’ టీమ్

29-09-2026 | 12:40pm

గట్టమ్మ తల్లికి తొలి మొక్కులు చెల్లించుకున్న పారడైజ్ టీం

- హీరోలు నాని, సంపూర్ణేష్ బాబు, దర్శక బృందం

ములుగు,(విజయక్రాంతి): ‘ప్యారడైజ్’ చిత్రం విజయవంతమైన నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం ములుగు జిల్లాకు చేరుకుంది. మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లుల దర్శనానికి వెళ్లే ముందు ములుగు గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంప్రదాయంలో భాగంగా చిత్ర బృందం తొలుత గట్టమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించింది.

మంగళవారం ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో హీరోలు నాని, సంపూర్ణేష్ బాబుతో పాటు దర్శకుడు ఓదెల శ్రీకాంత్ గట్టమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినిమా విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు చిత్ర బృందం ఆలయానికి వచ్చినట్లు సమాచారం.

హీరోలు నాని, సంపూర్ణేష్ బాబు రావడంతో వారిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. గట్టమ్మ తల్లి దర్శనం అనంతరం ‘ప్యారడైజ్’ చిత్ర బృందం మేడారం వైపు బయలుదేరింది. అక్కడ సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనుంది.


మరిన్ని వార్తలు