సుప్రీం తలుపు తట్టిన పిటిషనర్
29-09-2026 | 12:06pm
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ మెన్షన్ చేశారు. ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకపక్షంగా కాకుండా, కమిషన్‌లోని సభ్యుల ఏకాభిప్రాయం లేదా మెజార్టీ నిర్ణయం మేరకు ఉండాలని పిటిషనర్ కోరారు.
ముగ్గురు సభ్యులతో కూడిన ఎన్నికల కమిషన్‌లో ఏ ఒక్క సభ్యుడూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండకూడదని పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. సీఈసీ వ్యవహారశైలిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈసీకి సంబంధించిన వివాదంపై దాఖలైన పిటిషన్‌పై వచ్చేవారం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.