సఫాయి బస్తి ఏరియాలో కార్డన్ అండ్ సెర్చ్

23-10-2026 | 11:52am

49 వాహనాలటిపై జరిమానాలు, 87 మద్యం సీసాలు స్వాధీనం

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) ఎస్పీ రోహిత్ రాజు(SP Rohit Raju) ఆదేశాల మేరకు కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సఫాయి బస్తి ఏరియాలో శుక్రవారం తెల్లవారుజామున 4:00 గంటల నుంచి ఉదయం 7:00 గంటల వరకు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ(DSP Adinarayana) పర్యవేక్షణలో సబ్ డివిజన్ పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 47 ద్విచక్ర వాహనాలు, 2 త్రిచక్ర వాహనాలను గుర్తించి మొత్తం 49 వాహనాలపై చట్టప్రకారం జరిమానాలు విధించారు. అదేవిధంగా 87 ఐఎంఎఫ్ఎల్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పి ఆదినారాయణ మాట్లాడుతూ పేకాట, జూదం, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా ఓటీపీ, యూపీఐ మోసాలు, నకిలీ ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని, ప్రాంతంలో మతసామరస్యాన్ని కాపాడాలని కోరారు.ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో సీఐలు ఇంద్రసేనారెడ్డి, జితేందర్‌తో పాటు పోలీసు అధికారులు, సుమారు 80 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు