అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి
అంబేద్కర్ స్టేడియంలో అనంతరం పలు వార్డులలో విస్తృతంగా పర్యటించిన గండ్ర
పట్టభద్రుల ఓటు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర(Former MLA Gandra Venkataramana Reddy) అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం భూపాలపల్లి మున్సిపాలిటీ(Bhupalpally Municipality) పరిధిలోని క్రిష్ణకాలని అంబేద్కర్ స్టేడియంలో మార్నింగ్ వాకింగ్‌కు వచ్చిన ప్రజలను, యువతను ఆప్యాయంగా పలకరించి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
అనంతరం 7వ, 26వ, 5వ, 24వ వార్డులలో విస్తృతంగా పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ఆయా కుటుంబాల్లోని పట్టభద్రులతో పాటు వారి కుటుంబ సభ్యులను కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించి అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకొని, తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.