ఉపాధి హామీ పనులను నాణ్యతతో చేపట్టాలి

23-10-2026 | 12:10pm

పని ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలి

వెంకటాపూర్,(విజయక్రాంతి): మండలంలోని రామానుజపూర్ గ్రామంలో వీబీ జీ-రాంజీ పథకం(VB G-Ramji scheme) కింద చేపడుతున్న ట్రెంచ్ పనులను జలసిరి జిల్లా స్పెషల్ ఆఫీసర్ రాజారావు(Jalasiri District Special Officer Rajarao) శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి, కూలీలకు పలు సూచనలు చేశారు. ఉపాధి హామీ పనులు చేసే కూలీలు రోజుకు రూ. 308 వేతనం పొందేలా నిర్దేశించిన పనిని పూర్తి చేయాలని సూచించారు. కూలీలకు పని ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలని అధికారులకు ఆదేశించారు.

ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనుల(Employment guarantee works)కు కనీసం 100 మంది కూలీలు హాజరయ్యేలా గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల ద్వారా కూలీలకు పని కల్పించడంతో పాటు, పనులు సక్రమంగా నిర్వహించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ రవీందర్, ఏపీడీ వెంకటనారాయణ, ఏపీఓ రాజు, ఈసీ సురేష్, టెక్నికల్ అసిస్టెంట్లు సురేష్ కుమార్, రాజేష్, ఫీల్డ్ అసిస్టెంట్ నర్సయ్య, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు