పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు

23-10-2026 | 11:58am

​నర్సాపూర్: పండుగ సాయన్న 174వ జయంతి(Panduga Sayanna 174th Jayanti) వేడుకలను నర్సాపూర్ పట్టణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి(Constituency in-charge Avula Rajireddy) పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయన్న చేసిన సేవలను, ఆయన పోరాట స్ఫూర్తిని ఆయన కొనియాడారు. అనంతరం ఈ సందర్భంగా ​పట్టణంలో నల్ల ఆంజనేయులు ముదిరాజ్  మాట్లాడుతూ... ఈ వేడుకల్లో  ముదిరాజులంతా సాయన్న బాటలో నడవాలని అందరికీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్ల సంజీవులు, చెవిటి బాలరాజ్, నాగేష్, ఎల్లం, కొండాపూర్ శివ, కొండి దుర్గేష్, నాగభూషణం, నర్సింగరావు, చెవిటి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు