ఫార్మసీ విద్యార్థులకు అరుదైన అవకాశం
మూడు నెలల శిక్షణకు ఇద్దరు ఎం.ఫార్మసీ విద్యార్థుల ఎంపిక
మహబూబ్నగర్,(విజయక్రాంతి): పాలమూరు యూనివర్సిటీ(Palamuru University) ఫార్మసీ కళాశాల చరిత్రలో తొలిసారిగా ఇద్దరు ఎం.ఫార్మసీ విద్యార్థులు(M.Pharmacy Students) తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ సెంట్రల్ లాబొరేటరీ(Telangana Standards Authority for Food and Essential Drugs Central Laboratory)లో మూడు నెలల ప్రాక్టికల్ శిక్షణకు ఎంపికయ్యారు. మేఘావత్ శాలిని, బి. అమూల్య ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. రమేష్ బాబు విద్యార్థులను అభినందించారు. ప్రతిష్ఠాత్మక ప్రయోగశాలలో శిక్షణ పొందడం ద్వారా ఔషధాల నాణ్యత పరీక్షలు, ప్రయోగశాల విధానాలు, ఆచరణాత్మక పరిజ్ఞానంపై ప్రత్యక్ష అనుభవం లభిస్తుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. ఈశ్వర్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడీ వి. ప్రభాకర్ రెడ్డి, అధ్యాపకులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.