సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయుల నిరసన

31-10-2026 | 05:55pm

సదాశివనగర్,(విజయక్రాంతి): మోడల్ పాఠశాల(Model school)లోని ఉపాధ్యాయుల(Teachers ) సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం భోజన విరామ సమయంలో లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. MS-JAC (Model Schools Joint Action Committee) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఐదు రోజుల ఉద్యమ కార్యాచరణలో భాగంగా రెండవ రోజు నిరసన కార్యక్రమం చేపట్టినట్టు ఉపాధ్యాయులు తెలిపారు.

ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులందరూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి, తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన తెలిపారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజిరెడ్డి తో పాటు ఉపాధ్యాయ బృందం సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు