మేరు ప్రావీణ్యలో ప్రతిభ చాటిన విద్యార్థులు
- మానవాళి సమస్యలకు పరిష్కారాలు చూపిన యువ ఆవిష్కర్తలు
- గ్రాండ్ ఫినాలేలో విజేతలకు అవార్డుల ప్రదానం
హైదరాబాద్, నవంబర్ 6(విజయక్రాంతి): మేరు ఇంటర్నేషనల్ స్కూల్(Meru International School) ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఐడియాథాన్(Entrepreneurship Ideathon) ‘మేరు ప్రావిణ్య 2026’ విజయవంతంగా ముగిసింది. పాఠశాల ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ఎం-క్లాప్ (మేరు కెరీర్, లీడర్షిప్ అండ్ లైఫ్ స్కిల్స్, అకడమిక్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్)లో భాగంగా 5 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
‘డిజైన్ ఫర్ హ్యుమానిటీ: ఇన్నోవేషన్స్ ఫర్ సర్వైవల్ ఇన్ వార్’ అనే ఇతివృత్తంతో హైదరాబాద్‌లోని రాయదుర్గ్ టీ-హబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మియాపూర్, తెల్లాపూర్ క్యాంపస్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఏడాది దాదాపు రెండువేల మంది విద్యార్థులు 375 వినూత్న ఆలోచనలను రూపొందించారు. వీరిలో 247 మంది విద్యార్థులతో కూడిన 66 జట్లు నాలుగు రోజుల పాటు జరిగిన సెమీఫైనల్ పోటీల్లో పాల్గొన్నాయి. పరిశ్రమలకు చెందిన నిపుణులు ఈ ఆలోచనలను పరిశీలించి గ్రాండ్ ఫినాలేకు జట్లను ఎంపిక చేశారు.
గ్రాండ్ ఫినాలేకు మేరు ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ మేఘన గోరుకంటి జూపల్లి, లెర్నియా.ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ చిరంజీవి మద్దాల, బోవర్ స్కూల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ ఎక్స్పాన్షన్) రాజీవ్ కుమార్ జ్యూరీ సభ్యులుగా హాజరయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యా రంగ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
మేరు ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ మేఘన గోరుకంటి జూపల్లి మాట్లాడుతూ, ఎం-క్లాప్ కార్యక్రమాన్ని రూపొందించినప్పుడు విద్యార్థుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆలోచనా విధానం, ఆర్థిక అవగాహన, జీవిత నైపుణ్యాలను పెంపొందించాలనేది మా లక్ష్యం అన్నారు. మేరు ప్రావిణ్యలో విద్యార్థుల ప్రతిభ ద్వారా ఆ లక్ష్యం సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉంది అనితెలిపారు. కాగా గ్రాండ్ ఫినాలేలో విద్యార్థులు యుద్ధ పరిస్థితుల్లో మనుగడ, రక్షణ, భద్రత, విద్య, మానవతా అవసరాలకు సంబంధించిన ప్రాజెక్టులు, నమూనాలను ప్రదర్శించారు.
వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు అవార్డులు అందజేశారు. మేరు ప్రావిణ్య 2026 విజేతలు:టీమ్ థెర్మా జెల్ (7వ తరగతి): అత్యంత చలి పరిస్థితుల్లో సైనికులు అల్పోష్ణస్థితి (హైపోథెర్మియా) బారిన పడకుండా సహాయపడే ఆయింట్మెంట్ను రూపొందించినందుకు 6 తరగతుల విభాగంలో ఇన్నోవేషన్ ఇన్ యాక్షన్ అవార్డు గెలుచుకుంది. టీమ్ గార్డియన్ నెక్సస్ (7వ తరగతి): ఎస్ఓఎస్ అలర్ట్స్, జీపీఎస్ ట్రాకింగ్, ఎల్ఈడీ బీకన్, సోలార్ ఛార్జింగ్ సదుపాయాలతో కూడిన పోర్టబుల్ అత్యవసర రక్షణ పరికరాన్ని రూపొందించినందుకు బడ్డింగ్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు అందుకుంది.
టీమ్ అభయ (10వ తరగతి): బ్యాక్టీరియల్ సెల్యులోజ్, వాటర్ హయాసింత్ ఫైబర్‌తో పర్యావరణహిత బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్‌ను అభివృద్ధి చేసినందుకు 912 తరగతుల విభాగంలో బిజినెస్ విజనరీ అవార్డు గెలుచుకుంది. టీమ్ ఆస్టర్ (10వ తరగతి): యుద్ధ ప్రాంతాలు, శరణార్థి శిబిరాల్లోని పిల్లలు ఇంటర్నెట్ లేకుండానే విద్యను అభ్యసించేందుకు వీలుగా సోలార్ పవర్‌తో పనిచేసే లెర్నింగ్ టాబ్లెట్‌ను రూపొందించినందుకు నెకస్ట్ బిగ్ థింగ్ అవార్డు అందుకుంది.
టీమ్ ది అపెక్స్ (9వ తరగతి): అత్యంత క్లిష్ట పరిస్థితులను తట్టుకునేలా తేలికపాటి, అధిక మన్నిక కలిగిన సర్వైవల్ షూస్ ఆలోచనను అత్యుత్తమంగా ప్రజెంట్ చేసినందుకు 612 తరగతుల విభాగంలో బెస్ట్ పిచ్ అవార్డు గెలుచుకుంది. టీమ్ బీకన్ (9వ తరగతి): కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో మనుగడకు తోడ్పడే మన్నికైన, తేలికపాటి షూస్ ఆలోచనకు జ్యూరీ నుంచి జ్యూరీ స్పెషల్ మెన్షన్ అవార్డు అందుకుంది.