ఓఆర్ఆర్ పచ్చదనం పరిరక్షణకు చర్యలు
శుద్ధి చేసిన మురుగు నీటి సరఫరా చేసేందుకు నిర్ణయం
హెచ్ఎండీఏ, హెచ్‌సీసీబీ మధ్య ఎంవోయూ
హైదరాబాద్, నవంబర్ 23(విజయక్రాంతి): హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్(Hyderabad Outer Ring Road) (ఓఆర్ఆర్) వెంబడి ఉన్న మొక్కలు, పచ్చని ప్రదేశాలను పరిరక్షించడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(Hyderabad Metropolitan Development Authority) (హెచ్ఎండీఏ), హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్(Hindustan Coca Cola Beverages) (హెచ్‌సీసీబీ) సంస్థలు శుద్ధి చేసిన మురుగునీటిని సరఫరా చేయడానికి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈఒప్పందం ప్రకారం సిద్దిపేట జిల్లా(Siddipet District) బండతిమ్మాపూర్‌లోని హెచ్‌సీసీబీ ‘అవిన్య’ ఉత్పత్తి కేంద్రం నుంచి ప్రతిరోజూ 6 లక్షల లీటర్ల శుద్ధిచేసిన వ్యర ్థజలాలను సరఫరా చేయనున్నారు.
ఈనీటిని ఔటర్ రింగ్‌రోడ్డు వెంబడి (ఓఆర్ఆర్) వెంబడి ప్రత్యేకంగా ఎగ్జిట్ 4 నుంచి ఎగ్జిట్ 8 మధ్య, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోని ఇతర గ్రీన్బెల్ట్లలోని మొక్కలకు నీరందించడానికి వినియోగిస్తారు. హెచ్ఎండీఏ మెట్రో పాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సమక్షంలో హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్, బీపీపీ ఓఎస్డీ (ఇన్ఛార్జ్)రోహిత్‌గోపిడి ఈఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ ఉన్నతాధికారులతోపాటు అవిన్య ప్లాంట్ ఫ్యాక్టరీ మేనేజర్ మాధవన్ పిళ్లై నేతృత్వంలోని హెచ్సీసీబీప్రతినిధుల బృందం పాల్గొంది.
హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్అహ్మద్ మాట్లాడుతూ ఇటీవలి ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఇది అత్యంత సమయోచితమైన నిర్ణయమన్నారు. నగర పచ్చదనం కోసం శుద్ధిచేసిన వ్యర్థ జలాలను ఉపయోగించడంవల్ల భూగర్భ జలాలపై ఆ ధారపడటం తగ్గుతుందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి ఏడాది పొడవునా పచ్చదనాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి నిరంతర నీటి యాజమాన్య వ్యూహం అవసరమని రోహిత్‌గోపిడి అన్నారు.
హెచ్‌సీసీబీ ఇంటిగ్రేటెడ్ సప్లయ్ చైన్ అవినాష్‌కాంత్ కుమార్ మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం తమ అవిన్య తయారీ కేంద్రానికి మించి సంస్థ నీటి సంరక్షణ బాధ్యతను విస్తరిస్తుందని, ప్రాంతీయ పర్యావరణ పరిరక్షణకు చురుకుగా తోడ్పడేందుకు ఇది తమకు అవకాశం కల్పిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ దోనేపూడి చక్రపాణి, ఫారెస్ట్ మేనేజర్ నిఖిల్‌రెడ్డి, హెచ్‌సీసీబీ పబ్లిక్అఫైర్స్అండ్కమ్యూనికేషన్స్ మేనేజర్ కృష్ణ కాశ్యప్ తదితరులు పాల్గొన్నారు.