పల్నాడు ప్రాజెక్టును ఆపండి
- అనుమతుల్లేకుండానే నీటి తరలింపునకు ఏపీ ప్రయత్నం
- కృష్ణా జలాల విషయంలో ఆంధ్ర సర్కార్‌పై బీఆర్ఎస్ ఫిర్యాదు
- కేఆర్ఎంబీ చైర్మన్ సుబ్రాన్ష్ బిశ్వాస్‌తో గులాబీ నేతల భేటీ
- 8 టీఎంసీలకు పల్నాడు ప్రాజెక్టు విస్తరణ ప్రతిపాదనపై అభ్యంతరం
- హైదరాబాద్ తాగునీటి భద్రతపై ఆందోళన
- వచ్చే నెల 10న ‘నల్లగొండ నగారా’ : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, నవంబరు 23 (విజయక్రాంతి) : కృష్ణానదీ జలాల విని యోగం(Utilization of Krishna River Waters), నీటి తరలింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్(BRS) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చే పట్టడంతో పాటు, కృష్ణా జలాలను ఏ కపక్షంగా తరలించే ప్రయత్నం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. కృష్ణా జలాల(Krishna Waters)) కోసం అవసరమైతే మరో జల ఉ ద్యమం తప్పదని హెచ్చరించింది. వచ్చే నెలలో నల్లగొండ వేదికగా నగారా మో గించనున్నట్లు ప్రకటించింది.
సోమవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(Krishna River Management Board) (కేఆర్ఎంబీ) చైర్మన్ సుబ్రాన్ష్ బిశ్వాస్‌తో బీఆర్ఎస్ నేతలు భేటీ అ య్యా రు. మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి(Jagadish Reddy), సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే లు సుధీర్‌రెడ్డి, సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. నాగార్జునసాగర్ పరిధిలో ఏపీ చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు(Palnadu Water Grid Project) పనులను తక్షణమే నిలిపివేయించాలని, అనుమతులు లేని నీటి తరలింపు ప్రతిపాదనలపై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
పల్నాడు ఎత్తిపోతలతో పాటు హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ జలవనరుల శాఖ 2026 ఆగస్టు 4న జారీ చేసిన జీవో నంబర్ 453 ప్రకారం పల్నాడు ద్వారా ప్రస్తుత అవసరాల కోసం 1.865 టీఎంసీల నీటిని తరలించే ప్రతిపాదన ఉందన్నారు. అయితే భవిష్యత్తులో ఈ పథకాన్ని 8 టీఎంసీల సామర్థ్యానికి విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అమలైతే కృష్ణా జలాల పంపిణీపై ప్ర భావం పడటంతో పాటు, తెలంగాణ లో ఇప్పటికే ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులకు నీటి లభ్యత తగ్గే అవకా శం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అనుమతులు లేకుండా పనులా?
పల్నాడు ఎత్తిపోతలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం- నిబంధనలను బీఆర్ఎస్ నేతలు కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు. చట్టంలోని సెక్షన్ 84(3) ప్రకారం కృష్ణా నదీ జలాలకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రతిపాదనలను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలించి అవసరమైన అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సెక్షన్ 85(8), షెడ్యూల్-11 నిబంధనలను కూడా ప్రస్తావించారు. సంబంధిత అనుమతులు, బోర్డుల ఆమోదాలు లేకుండా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం చట్ట నిబంధనలకు విరుద్ధమని అభ్యంతరం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ మైనర్ రివర్ ప్రాజెక్టుల (ఏఎంఆర్పీ) ప్రణాళిక ప్రకారం 510 అడుగుల నీటిమట్టం వరకు నీటిని తరలించే అవకాశం ఉన్నప్పటికీ, 493.47 అడుగుల నుంచే నీటిని తరలిస్తే శ్రీశైలం జలాశయంలో నీటి లభ్యతపై ప్రభావం పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తక్షణమే చర్యలు చేపట్టండి..
హైదరాబాద్ నగరానికి భవిష్యత్తులో తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. నగర జనాభా పెరుగుదల, పట్టణ విస్తరణ, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని కృష్ణా జలాల వినియోగంపై నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. కృష్ణా జలాలు ఉమ్మడి నదీ జలాలని, రెండు రాష్ట్రాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత కేఆర్ఎంబీపై ఉందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రాజెక్టులు చేపట్టి నీటిని తరలించకుండా బోర్డు తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు.
పల్నాడు వాటర్ గ్రిడ్, ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేయించి, వాటికి సంబంధించిన అన్ని అనుమతులు, డీపీఆర్‌లు, నీటి వినియోగ ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 493.47 అడుగుల నీటిమట్టం నుంచి నీటి తరలింపునకు సంబంధించిన అంశంపై ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని కోరారు. కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ హక్కులు, సాగునీటి ప్రయోజనాలు, హైదరాబాద్ నగర భవిష్యత్తు తాగునీటి భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని కోరారు.
కృష్ణా జలాల కోసం మరో జల ఉద్యమం : జగదీశ్‌రెడ్డి
కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై మరో జల ఉద్యమానికి శ్రీకారం చుడతామని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబర్ 10న నల్లగొండ పట్టణంలో ‘నల్లగొండ నగారా’ పేరు తో లక్షలాది మంది రైతులతో బహిరంగ సభ పెడతామని ప్రకటించారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హా జరవుతారనారు. జలసౌధ వద్ద ఆయ న మీడియా మాట్లాడారు. కృష్ణా, గోదావరి జలాల్లో ఏపీ తన వాటాకు మించి నీటిని వినియోగించుకుంటోందని ఆరోపించారు.
మూడు నెలల్లో 90 లక్షల మందికి 9 టీఎంసీల తాగునీరు అవసరమవుతుందా? అని ప్ర శ్నించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని మండిపడ్డారు. కేసుల నుంచి బయటపడేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ పాలకులు లొంగిపోయారంటూ ఆరోపించారు. ప్రభుత్వం పోరాటం చేయకపోతే ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఏపీ అక్రమంగా చేపడుతున్న ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం, నిర్లక్ష్యం వల్లే ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుపోతోందని విమర్శించారు. గతంలో పోతిరెడ్డిపాడు విషయంలో జరిగిన అన్యాయమే ఇప్పుడు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని హెచ్చ రించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఉమ్మడి పాలమూరు ప్రాంతం ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిందని, ఎగు వన కర్ణాటక, దిగువన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం జరుగుతోందని పేర్కొనారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పల్నాడు ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని ఆరోపించారు.
బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మ క్కయ్యాయం టూ వస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ, వాస్తవానికి కాంగ్రెస్ ప్రభు త్వమే తెలంగాణ ప్రజల తాగునీటి ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రికి ప్రాజెక్టుల పరిస్థితిపై కనీస అవగాహన లేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ మరోసారి జల ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కేఆర్ఎంబీ సమావేశానికి హాజరై తెలంగాణ ప్రయో జనాల కోసం పోరాడాలని ఆయ డిమాండ్ చేశారు.