నేడు యువ భారత్‌కు డూ ఆర్‌ డై మ్యాచ్‌

24-11-2026 | 07:23am

దోహా: ఆసియాకప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీ(Asia Cup Rising Stars Tournament)లో భారత్‌-ఏకు కీలక సమయం ఆసన్నమైంది. గ్రూప్‌ దశలో చివరి పోరుకు సిద్ధమైంది. మంగళవారం యూఏఈతో జరిగే మ్యాచ్‌లో గెలిచి సెమీఫైనల్‌(Semi Final) అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలని పట్టుదలతో ఉంది. టోర్నీ ఆరంభంలో నేపాల్‌పై ఘన విజయం సాధించిన భారత జట్టుకు పాకిస్థాన్‌ చేతిలో ఎదురైన ఓటమి నిరాశ కలిగించింది. ముఖ్యంగా బౌలింగ్‌ విభాగం ఆశించిన స్థాయిలో రాణించకపోవడం జట్టు మేనేజ్‌మెంట్‌కు ఆందోళనగా మారింది.

ఈ నేపథ్యంలో యూఏఈతో పోరులో బౌలర్లు పుంజుకోవడం కీలకం కానుంది. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ సమష్టిగా రాణిస్తేనే భారత్‌కు విజయం దక్కే అవకాశాలుంటాయి. గ్రూప్‌ దశలో చివరి మ్యాచ్‌ కావడంతో యువ భారత ఆటగాళ్లకు ఇది కీలక పరీక్షగా మారింది. భారత్‌-ఏ, యూఏఈ మధ్య మ్యాచ్‌ మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది.

మరిన్ని వార్తలు