బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థి మృతి
బాసర: నిర్మల్ జిల్లా(Nirmal District) బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లో విషాదం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం(Second year of engineering) చదువుతున్న సంపత్ (19) సోమవారం రాత్రి హాస్టల్ గదిలో మృతిచెందాడు. రాత్రి భోజనానికి సహచర విద్యార్థులు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
విషయం గుర్తించిన తోటి విద్యార్థులు, సిబ్బంది వెంటనే స్పందించి అతడిని భైంసా ప్రభుత్వ ఆస్పత్రి(Bhainsa Government Hospital)కి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన సంపత్ మరణానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ చేపట్టారు. అతడి ఆర్థిక లావాదేవీలు సహా ఇతర వ్యక్తిగత అంశాలపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. మృతికి అసలు కారణం పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.