ప్రజావసరాల భూములను అమ్మొద్దు
- రైతులకు తిరిగి అప్పగించాలి
- ఎంపీ ఈటల డిమాండ్
కూకట్ పల్లి, నవంబర్ 23,( విజయక్రాంతి): హెచ్ఎండీఏ పరిధిలోని(HMDA jurisdiction) కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల(Kukatpally truck park lands) వేలాన్ని నిరసిస్తూ సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో మహాదీక్ష నిర్వహించారు. కూకట్పల్లి బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి మాధవరం కాంతారావు(Madhavaram Kantarao), రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Eatala Rajender) ముఖ్యఅతిథిగా హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. గతంలో మూడు పంటలు పండే 33 ఎకరాల భూమిని ట్రక్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం రైతుల నుంచి ఎకరాకు లక్ష రూపాయల చొప్పున సేకరించిందని తెలిపారు.
ప్రస్తుతం ఆ భూముల విలువ కోట్ల రూపాయలకు చేరడంతో ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించడం అన్యాయమని మండిపడ్డారు. ట్రక్ పార్క్ అవసరం లేకుంటే భూములను వాటిని ఇచ్చిన రైతులకే తిరిగి అప్పగించాలని ఈటల డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, పెన్షన్లు(Fee reimbursement, pensions) వంటి సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చేందుకు ప్రత్యామ్నాయ భూములను పరిశీలించాలని ఆయన సూచించారు. సమీపంలోని ఐడీయల్ భూములు333 ఎకరాలు ఉన్నాయని, వాటి ద్వారా వేలకోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా ఫినిక్స్ సంస్థకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు.