అమీర్‌పేటలో బజ్జీలు వేసిన స్టార్ హీరో
సినిమా ప్రమోషన్లలో(Movie Promotes) కొత్తదనం చూపించడంలో నటుడు విజయ్ ఆంటోనీ(Actor Vijay Antony) తనదైన శైలి చాటుకున్నారు. తన తాజా చిత్రం ‘నాన్న కుట్టి’ ప్రచారంలో(Nanna Kutty Promotions) భాగంగా హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో సందడి చేశారు. సెలబ్రిటీ హోదాను పక్కనపెట్టి సాధారణ వ్యక్తిలా స్థానికులతో కలిసిపోయారు.
అక్కడి చిరు వ్యాపారులను పలకరిస్తూ సందడి చేసిన ఆయన.. ఓ మిర్చి బజ్జీల(Mirchi Bajji) బండి వద్దకు వెళ్లి స్వయంగా బజ్జీలు తయారు చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రీతి అస్రానీ కూడా ఆయనతో జత కలిశారు. అనంతరం స్థానిక హోటల్‌లో చాయ్, బన్ మస్కాను ఆస్వాదిస్తూ అభిమానులతో ముచ్చటించారు.
విజయ్ ఆంటోనీని గుర్తించిన అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఆయన సింప్లిసిటీకి ఫిదా అయ్యారు. ఖరీదైన ఈవెంట్లకు భిన్నంగా సామాన్యుల మధ్యకు వెళ్లి సినిమా ప్రచారం చేయడం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. విజయ్ ఆంటోనీ, ప్రీతి అస్రానీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘నాన్న కుట్టి’ నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు చిత్రబృందం చేపడుతున్న వినూత్న ప్రచార కార్యక్రమాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
Vijay Antony & Preethi Asrani spread smiles in Hyderabad, serving Mirchi Bajji and interacting with fans! ❤️🔥 #NannaKuttyFromNov27 | Trailer Tomorrow! ✨ https://t.co/WYQwKnBxk7
— Film Loop (@filmloop123) November 23, 2026