రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో గురుకుల విద్యార్థి ప్రతిభ
29-09-2026 | 05:36pm
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్(Telangana Athletic Association) ఆధ్వర్యంలో హనుమకొండలోని జేఎన్‌ఎస్ స్టేడియంలో ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించిన 41వ రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో ఆసిఫాబాద్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాల విద్యార్థి జాడి సాయికుమార్ సత్తా చాటాడు.
జావెలిన్ త్రో విభాగంలో రెండో స్థానంలో నిలిచి వెండి పతకం సాధించాడు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకం సాధించడంపై కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ రహీం హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి సాయికుమార్‌ను ప్రిన్సిపల్ అబ్దుల్ రహీం, వైస్ ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్, పీడీ కోట యాదగిరి, పీఈటీ ఎస్. ప్రసాద్, హౌస్ మాస్టర్ కోసరి మహేష్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.