చెకుముకి టాలెంట్ టెస్ట్ పోస్టర్ విడుదల
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న చెకుముకి టాలెంట్ టెస్ట్ సైన్స్ సంబరాలు–2026 పోస్టర్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి డి. సచ్చిదానంద చారి(District Education Officer Sachidananda Chary) బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచన, సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని తెలిపారు.
జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు టాలెంట్ టెస్ట్‌లో పాల్గొనేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, మేడి చరందాసు, వడ్లూరి రాజేష్, సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.