గణనాథునికి 51 రకాల నైవేద్యాలు సమర్పించిన భక్తులు

21-09-2026 | 06:02pm

బెజ్జూర్ సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): బెజ్జూర్ మండల(Bejjur Mandal) కేంద్రంలోని గణనాథునికి మహిళలు 51 రకాల నైవేద్యాలు సమర్పించి మోక్కులు చెల్లించుకున్నారు. మండల కేంద్రంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో ఏర్పాటు చేసిన గణనాథునికి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, మహిళలు 51 రకాల నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు తంగేడి పల్లి మహేష్, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు