డీఎల్ఆర్ కార్మికుల మధ్య మంత్రి జన్మదిన వేడుకలు

29-10-2026 | 11:33am
సత్తుపల్లి, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్(Chairman of the Minimum Wages Advisory Board) జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) జన్మదిన వేడుకలను సత్తుపల్లి ఏరియాలోని కిష్టారం ఓపెన్ కాస్ట్ మైన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఐఎన్‌టీయూసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ షేక్ బాజీ ఆధ్వర్యంలో కిష్టారం ఓసీ కార్మికులు, డీఎల్ఆర్ కార్మికులు కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సింగరేణి కార్మికుల పలు సమస్యల పరిష్కారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని ఈ సందర్భంగా వారు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో గాజే బాలాజీ, ఆవునూరి రాజేశ్వరరావు, కోటేశ్వరరావు, నజీర్, హమీద్, వామనమూర్తి, గుడిపల్లి శ్రీనివాస్, ఇమామ్, హనుమంతురావు, డి. శ్రీనివాస్, ఎం. రాజశేఖర్, మేడిపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే డీఎల్ఆర్ కార్మికులు లక్ష్మణరావు, నాగేంద్రబాబు, తాటి నాగేశ్వరరావు, షారుక్, బిరవల్లి శ్రీనివాస్, షేక్ జానీ మియా తదితరులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు