సిద్దిపేట కేజీబీవీలో ఏం జరిగింది?
29-10-2026 | 12:27pm
సిద్దిపేట రూరల్, అక్టోబర్ 29: సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని బుధవారం అర్ధరాత్రి మృతి చెందింది. గుడికందుల గ్రామానికి చెందిన లాస్య (15) రాఘవాపూర్ కేజీబీవీలో చదువుకుంటోంది.
రాత్రి సమయంలో ఆరోగ్యం (Health) బాగాలేక లాస్య ఇబ్బంది పడినట్లు బంధువులు తెలిపారు. ఆసుపత్రికి తరలించేలోపే విద్యార్థిని మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విద్యార్థిని మృతికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.