కొప్పుల అశోక్ ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
తిరుమలాయపాలెం, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): తిరుమలాయపాలెం మండల కేంద్రంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) జన్మదిన వేడుకలను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు రామసహాయం నరేష్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం రామసహాయం నరేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి మంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి భూభారతి, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బోడ మంగీలాల్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం రాజశేఖర్, రామసహాయం అరవింద్ రెడ్డి, అజ్మీర బాలాజీ, షేక్ నజీర్, సర్పంచులు ధరావత్ సుజాత, నరసింహారావు, ఉప సర్పంచ్ బుర్ర శ్రీనివాస్, వనవాసం నరేందర్ రెడ్డి, సంఘబత్తుల సుమన్ రెడ్డి, బోడ విజయ చంద్రు, మోర అనిల్ రెడ్డి, బానోత్ సిమ్లా నాయక్, నందిపాటి మల్లికార్జున్, గుమ్మడి దేవభిక్షం,
నునావత్ సమ్మక్క, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నల్లమల్ల ప్రతాప్, కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, లంజపల్లి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నల్లబెల్లి లింగయ్య, విశ్రాంత ఎస్సై చుంచు కోటయ్య తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.