చదువు విలువ తెల్పిన కస్తూర్భా విద్యాలయం

01-11-2026 | 11:13pm

ఘనంగా కేజీబీవీ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

సింగరేణి నవంబర్ 1 (విజయక్రాంతి): చదువు మానివేసిన విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపిన కస్తూర్భా విద్యాలయం ఆడ పిల్లల చదువు విలువ తెల్పిందని కారేపల్లి కస్తూర్భా విద్యాలయ(Kasturba Gandhi Vidyalaya) విశ్రాంత స్పెషల్ ఆఫీసర్ బుగ్గవీటి సుదర్శన్రావు, డైట్ కళాశాల అధ్యాపకులు ఎస్.వెంకటేశ్వర్లు అన్నారు. కారేపల్లి కస్తూర్భా గాంధీ విద్యాలయ 2010-11 పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది.

ఈ సమ్మేళనం విద్యార్ధుల గత పరిస్థితి, నేటి పరిస్థితి ని తెలిపి ఉద్వేగ భరితులైనారు. తాము జీవితాలల్లో నిలదొక్కుకోవటానికి కస్తూర్భా విద్యాలయం బాటలు వేసిందని పూర్వ విద్యార్ధినులు విరించారు. తమ కుటుంబాలను తీర్చిదిద్దుకోవటంలో అప్పటి గురువుల పాత్రను, అనాటి జ్ఞాపకాలను వారు గుర్తు చేసుకున్నారు.

ఈ సంధర్భంగా అప్పటి స్పెషల్ ఆఫీసర్ బుగ్గవీటి సుదర్శన్ రావు మాట్లాడుతూ విద్యార్థులు, వారి కుటుంబాలు సమాజంలో ఉ న్నతి స్థితికి ఎదిగితే అనందించింది చదువు చెప్పిన గురువులే అని అన్నారు. చదువు చెప్పిన గురువులను గుర్తుంచుకోని సన్మానించటం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో కారేపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భీమవరపు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు కే.రమా, రిహానాబేగం, నాగమణి, భానుమతి, షహీనా బేగం, స్వరూప, పూర్వ విద్యార్థులు ఆవుల మౌనిక, జ్యోతి, రేణుక, నాగమణి, రమ్య, సుజాత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు