రైతు సేవలోబోథ్ సహకార సంఘం ముందు ఉంది

08-10-2026 | 04:09pm

బోథ్. సెప్టెంబర్ 8 (విజయ క్రాంతి) రైతులకు సేవలు అందించడంలో తమ సహకార సంఘం ముందు వరసలో ఉందని రైతులు సహకరించినట్లయితే అన్ని రంగాలలో ముందుకు వెళ్లే ఆస్కారం ఉందని సహకార సంఘం సీఈవో భారె నాగభూషణ్(Boath Cooperative Society CEO Bhare Nagabhushan ) పేర్కొన్నారు. తమ సొసైటీ పరిధిలో రెండు కోట్ల 95 లక్షల పంటలు నాలుగు ఇవ్వడం జరిగిందని అయితే 238 మంది రైతులు పంటరనాలను చెల్లించినట్లయితే పావలా వడ్డీ వర్ధిస్తుందన్నారు.

అంతేగాక దీర్ఘకానిక రుణాలు ఒక కోటి 38 లక్షల 92000 ఇవ్వడం జరిగిందని అయితే రుణాలు తీసుకున్న రైతులు తమ ఇన్స్టాల్మెంట్ను చెల్లించాలని కోరారు. లేకుంటే రైతులు నష్టపోతారన్నారు. ఇక సోనాల, బోత్ సెంటర్లలో రైతులకు అవసరమైన ఎరువులను విక్రయించడం జరుగుతుందన్నారు. లక్ష క్వింటాళ్ల జొన్న పంటను కొనుగోలు చేసి జిల్లాలో రెండవ స్థానంలో ఉన్నామన్నారు.

శనగ విత్తనాలు సిద్ధం.... వ్యవసాయ శాఖ తరఫున సహకార సంఘం ద్వారా శనగ విత్తనాలు అమ్మ కానికి సిద్ధంగా ఉన్నాయని సీఈవో తెలిపారు. ఆసక్తి గల రైతులు తమ పేర్లు నమోదు చేసుకుంటే విత్తనాలు ఇవ్వనున్నమన్నారు. పూర్తి వివరాలకు సొసైటీలో సంప్రదించాలని కోరారు. పోటీ మార్కెట్లో సహకార సంఘం రైతుల సహకారంతో తక్కువ ధరకు ఎరువులు విత్తనాలు అందిస్తుందన్నారు.

గన్ని బ్యాగుల డబ్బులు వారం రోజుల్లో....

గతంలో వివిధ పంటలు విక్రయించినప్పుడు కొంతమంది రైతులు తమ సొంత డబ్బులతో గన్ని బస్తాలు కొనుగోలు చేసి పంటను విక్రయించా ఉన్నారు. అయితే వారం రోజుల్లో బస్తాలు 22 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు