ముదిగంటి విష్ణువర్ధన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

02-11-2026 | 05:18pm

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రం లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ  వీరబ్రహ్మేంద్ర వృద్ధుల ఆశ్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాలల హక్కుల ప్రజా వేదిక సమన్వయకర్త మెరుగు లక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం రోజున ప్రముఖ సంఘ సేవకులు తెలంగాణ యూత్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు  ముదిగంటి విష్ణువర్ధన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర గవర్నర్, తెలంగాణ రాష్ట్ర స్థాయి సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ హాజరై పుట్టినరోజు కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ముదిగంటి విష్ణువర్ధన్ రెడ్డి  తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి పది జిల్లాల్లో తెలంగాణ యూత్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ సాధన లక్ష్యంగా మలిదశ ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా యువజన సంఘాలను యువతను విద్యార్థులు కలుపుకొని అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని రాజకీయ పార్టీలతో చర్చ వేదిక పెట్టిన మహానుభావుడుని కొనియాడారు , తెలంగాణ ఉద్యమంలో యువతను ముందు నడిపించిన వ్యక్తి ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందదాయకమని   ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ కోఆర్డినేటర్ బుజ్జ ఎల్లయ్య , మధు, ఆశ్రమ నిర్వాహకులు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు