విశ్వవిద్యాలయ బీ ఫార్మసీ లో తక్షణ ప్రవేశాలు

04-10-2026 | 06:10pm

ముకరంపుర, అక్టోబర్ 4 (విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం(Satavahana University) యల్ యం డి క్యాంపస్ లో గల ఫార్మసీ కళాశాలలో(Pharmacy College) బీ ఫార్మసీ మొదటి సంవత్సరం లో మిగిలిన సీట్ల భర్తీకి(Filling of seats) ఈ నెల 6 వ తేదీన తక్షణ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. కే. శ్రీశైలం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఉదయం 11 గంటల లోపు ఉజ్వల పార్కు సమీపం లోని ఫార్మసీ కళాశాలలో హాజరు కావాలన్నారు.

ఇప్పటి వరకు ఎక్కడా అడ్మిషన్ తీసుకోని వారికి అవకాశం ఉంటుందని, అభ్యర్థులు ఇంటర్మీడియట్ వరకు టీసీ తో సహా అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఎప్ సెట్ ర్యాంకు కార్డు తీసుకుని హాజరు కావాలని సూచించారు. ఎప్ సెట్ అర్హులు లేని పక్షం లో ఇతరులకు అవకాశం ఉంటుందని అన్నారు. తక్షణ ప్రవేశాల ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులకు ప్రభుత్వం నుండి ఫీజు రీయింబర్సుమెంటు మరియు స్కాలర్షిప్ లకు అర్హత ఉండదని అన్నారు. 

మరిన్ని వార్తలు