గణేష్ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత మండప కర్ర పూజ

08-10-2026 | 04:02pm

ముకరంపుర, అక్టోబర్ 8(విజయ క్రాంతి): కరీంనగర్ సిటీ కాశ్మీర్ గడ్డ ప్రాంతంలోని  గణేష్ యూత్(Ganesh Youth group) మరియు మాజీ కార్పొరేటర్ టి.శ్రీదేవి- చంద్రమౌళి(Former Corporator T. Sridevi-Chandramouli) ఆధ్వర్యంలో దేవి నవరాత్రోత్సవాల సందర్భంగా ప్రతిష్టించనున్న దుర్గామాత మండప నిర్మాణ పనులకు కర్ర పూజ ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలతో కర్ర పూజను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఫండస్ స్కూల్ యాజమాన్యం ప్రభాకర్ రెడ్డి, గణేష్ యూత్ ప్రతినిధులు శ్రీరామ్, రూపేష్, ఐలేని రాజశేఖర్ రెడ్డి, భాస్కర్, సంటి అశోక్, స్థానిక నాయకులు, మహిళలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు