నగర పాలక సంస్థలో గాంధీజీ జయంతి వేడుకలు
02-10-2026 | 07:00pm
ముకరంపుర, అక్టోబర్ 2 (విజయక్రాంతి): మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో గాంధీజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీజీ చిత్రపటానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్(Mayor Kolagani Srinivas), బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మున్సిపల్ అధికారులు, కార్పొరేషన్ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని బాపూజీకి నివాళులర్పించారు.