ప్రభుత్వ ఉద్యోగులపై విషప్రచారం సిగ్గుచేటు
ముకరంపుర, అక్టోబరు 10 (విజయ క్రాంతి): ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్(Government Employees' Pension), వారి సేవలు, ఆర్థిక భద్రతపై వాస్తవాలను పక్కనపెట్టి, ప్రజల్లో ఉద్యోగుల పట్ల అపోహలు కలిగించే విధంగా వ్యాసాలు రాయడం, వ్యాఖ్యలు చేయడం బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యవాదికి తగదని కరీంనగర్ జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి(JAC Chairman Daram Srinivas Reddy), టిఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంగం లక్ష్మణరావు ఖండించారు.
ఒకప్పుడు ఐఏఎస్ అధికారిగా, శాసనసభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉన్న లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ వంటి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలను, వారి సేవలను, పదవీ విరమణ అనంతర భద్రత అవసరాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను అవమానించడం అంటే ప్రజాసేవను అవమానించడమేనని, పెన్షన్ భిక్ష కాదు—ఉద్యోగి గౌరవప్రదమైన జీవితానికి సంబంధించిన హక్కు తెలిపారు. ఉద్యోగుల సేవలను గుర్తించాలని.. వారి హక్కులను గౌరవించాలని కోరారు.