రేవంత్‌కు స్కిల్ ఉందా?
- 420 హామీల అమలులో కాంగ్రెస్ ఘోరంగా విఫలం
- 100 రోజులన్నారు, వెయ్యి రోజులైంది.. ఏం చేశారు?
- ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే రోజులు దగ్గరలోనే..
- కరీంనగర్ ‘యువ సమరభేరి’లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కరీంనగర్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ఉద్యోగాల భర్తీ(job recruitment)పై సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) ఆరో పించారు. ‘రాహుల్ గాంధీ.. ఎక్కడున్నావు? హైదరాబాద్(Hyderabad)కు ఎందుకు రావు?’ అంటూ ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు(Jobs) ఇస్తామంటూ మోచేతికి బెల్లం పెట్టి నిరుద్యోగులు(unemployed), యువత(youth)ను మోసం చేశారని, కాంగ్రెస్ అగ్రనాయ కత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
‘బకాసురుల్లాగా మేస్తున్నరు, కుంభకర్ణుల్లాగా పంతున్నరు, పందికొక్కుల్లాగా తింటున్నరు.. అది తప్ప చేసింది ఏమీలేదు. తిన్నది అరగక కేసీఆర్ రాజీనామా(KCR resignation) చేయాలని తీట మాట లు మాట్లాడుతున్నారు. రాజీనామా ఎవరు చేయాలే.. ఎందుకు చేయలే?’ అని అడుగుతున్నా అని కేటీఆర్ ప్రశ్నించారు. 100 రోజుల్లో అన్నీ అమలు చేస్తామని డైలాగులు కొట్టారు, వెయ్యి రోజుల పాలన పూర్తయ్యిందని.. మోసం చేసిన ధోకేబాజ్ రాజీనామా చేయాల్నా లేదా.. చెప్పాలన్నారు.
అధికారంలోకి రావడానికి కాంగ్రెస్(Congress) ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం కాదని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చే యాల్సిన అవసరం ఉందని అన్నా రు. ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. శనివారం కరీంనగర్‌లో నిర్వహించిన ‘యువ సమరభేరి’ సభలో కేటీఆర్ మాట్లాడారు.
‘తెలంగాణలో మూడు తరాలను ముంచిన ముసలి నక్క కాంగ్రెస్ పార్టీ.. 1956లో తెలంగాణకు, ఆంధ్రకు ఇష్టంలేని బలవంతపు పెళ్లి చేసింది కాంగ్రెస్. 1968లో 370 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్’ అని ధ్వజమెత్తారు. 1971లో తెలంగాణ ప్రజలు 11 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించారని, మా తెలంగాణ మాకు కావాలని పోరాటం చేసిన వారిని కాంగ్రెస్‌లో కలుపుకుని ప్రత్యేక రాష్ర్టం ఇవ్వకుండా వేలాది మంది ప్రాణా లను బలిగొన్నారని కేటీఆర్ మండిపడ్డారు.
2004లో ఇదే కరీంనగర్ గడ్డపై సోనియాగాంధీ తెలంగాణ ప్రజల మనోభావాలు తనకు తెలుసని, తెలంగాణ ఇస్తామని చెప్పడం తో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని గుర్తుచేశారు. అయి తే పదేళ్లపా టు తెలంగాణ ప్రజలను సతాయించారని, తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో శ్రీకాంతాచారి వంటి వందలాది మంది తమ్ముళ్లను బలితీసుకున్నారని పేర్కొన్నా రు. కాంగ్రెసోళ్లు బయట తిరిగే పరిస్థితి లేకపోవడం, చివరకు కేసీఆర్ నాయకత్వంలో ‘కేసీఆర్ చచ్చుడో.. తెలం గాణ వచ్చుడో’ అనే నినాదంతో ఉద్యమం ఉధృతం కావడంతో ముసలి నక్క కాంగ్రెస్ దిగివచ్చిందన్నారు.
‘టీ డిక్లరేషన్’ ఏమైంది?
కాంగ్రెస్ నేతలు గతంలో టీ డిక్లరేషన్ (తెలంగాణ డిక్లరేషన్) పేరుతో పెద్దపెద్ద హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పరిస్థితి ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ర్టంలో ఉద్యోగాలు లేవని, నోటిఫికేషన్లు లేవని, ‘లూటిఫికేషన్లు మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నాయని’ ఆయన విమర్శించారు. నిరుద్యోగుల సమస్యలపై రాహుల్‌గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
అసెంబ్లీలో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ‘టీ డిక్లరేషన్’ పేరుతో హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ‘బూతు డిక్లరేషన్’తో ప్రజలను మోసం చేస్తోందని ఎద్దేవా చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు స్కిల్ లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంటున్నారని, ఆయనకు స్కిల్ ఉందా? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రధాని మోదీని గడగడలాడించిన యువతకు రేవంత్‌రెడ్డి లెక్క కాదని వ్యాఖ్యానించారు. ‘ఓటుకు నోటు’ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి ఎలా అయ్యారని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లక్కీ లాటరీలా దక్కిందని ఎద్దేవా చేశారు.
ఉద్యోగాలపై కాంగ్రెస్‌కు సవాల్..
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో 2.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని కేటీఆర్ తెలిపారు. స్థానికులకు ఉద్యోగాల్లో 95 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు. రీ-నోటిఫికేషన్లను మినహాయిస్తే 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని అన్నారు. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
బీఆర్‌ఎస్ హయాంలో భర్తీ చేసిన 2.32 లక్షల ఉద్యోగాలపై చర్చకు కాంగ్రెస్ సిద్ధమా? అని కేటీఆర్ సవాల్ విసిరారు.‘రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం’ అంటూ యువతను మభ్యపెట్టారని, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు వెయ్యి రోజులు గడిచిపోయినా ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని మండిపడ్డారు.‘వంద రోజులు అని చెప్పి వెయ్యి రోజులు మోసం చేసిన ప్రభుత్వం రాజీనామా చేయాలా? లేక తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ రాజీనామా చేయాలా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఈ కార్యక్ర మంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకష్ణారావు, బీఆర్‌ఎస్, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కేటీఆర్ వాహనానికి తృటిలో తప్పిన ముప్పు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. మానకొండూ రు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యం లో బీఆర్‌ఎస్ శ్రేణులు అలుగునూరు చౌరస్తా వద్ద కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికాయి. భారీ క్రేన్‌తో గజమాల వేసి సన్మానించారు. అనంతరం మహిళలు కేటీఆర్‌కు రాఖీలు కట్టారు. ఈ క్రమంలో కేటీఆర్ కారు వెనుక డోర్‌ను తెరిచే సమయంలో పక్క నుంచి వెళ్తున్న లారీ డోర్‌కు తగిలింది. టీఆర్‌కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంద రూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కాన్వాయ్ తో కరీంనగర్‌కు బయలుదేరారు.






