'డబుల్' ఇళ్లకు అవసరమైన మరమ్మత్తులు చేయించండి
నీరు, విద్యుత్, రోడ్డు వంటి కనీస వసతులు తప్పనిసరిగా కల్పించాలి
కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్,సెప్టెంబర్19(విజయక్రాంతి): హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల(double-bedroom housing scheme)కు అవసరమైన మరమ్మతులు చేయించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా(Collector Chitra Mishra) అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో గృహ నిర్మాణ శాఖ, ఆర్ అండ్ బీ అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిసరాలు శుభ్రం చేయించాలని పేర్కొన్నారు.
ఇళ్ల వద్ద ప్రస్తుత పరిస్థితి, అవసరమైన మరమ్మత్తులు, కల్పించాల్సిన నీటి, విద్యుత్, రోడ్డు తదితర కనీస సౌకర్యాల గురించి చర్చించారు. అర్హులకు ఇల్లు అందించిన తర్వాత సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు ముందస్తుగా చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ డీఈ ప్రవీణ్, ఆర్అండ్ బీ డీఈ శ్రీకాంత్, జేఈ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.