ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం

25-10-2026 | 06:40pm

బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు..

ముకరంపుర, అక్టోబర్ 25(విజయక్రాంతి): కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ  ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ(Congress Party) అనవసర రాద్ధాంతం చేస్తూ పనికిమాలిన రాజకీయం చేస్తోందని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు  ధ్వజమెత్తారు. ఆదివారం కరీంనగర్ కొత్తపల్లి మండలంలో(Kothapalli Mandal, Karimnagar) నిర్వహించిన పోలింగ్ బూత్ సమావేశం ,ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' వీక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

నకిలీ ఓట్లను, మరణించిన వారి ఓట్లను తొలగించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే  ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఓటు బ్యాంక్ రాజకీయం కోసం కాంగ్రెస్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ , ఎన్నికల వ్యవస్థపై అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్  ప్రజా విశ్వాసం కోల్పోయిందని , ప్రధానంగా  ఎస్ఐఆర్ ప్రక్రియలో దేశానికి వలస వచ్చి అక్రమంగా ఓటు పొందిన రోహింగ్యాలు , మైనార్టీల ఓటు తొలగిస్తున్నారనే   నెపంతోనే కాంగ్రెస్ గగ్గోలు పెడుతుందన్నారు.

ప్రజలను తప్పుదారి పట్టిస్తూ రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి  వచ్చేలా నవంబర్ 5న కరీంనగర్‌ లో నిర్వహించనున్న భారీ ర్యాలీ కి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హాజరవుతున్నట్లు ప్రవీణ్ రావు వెల్లడించారు. ఈ ర్యాలీలో యువత, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని  ఆయన పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కుంట తిరుపతి, శక్తి కేంద్ర ఇన్చార్జ్ వేముల అనిల్ కుమార్, బూత్ అధ్యక్షులు ఎగ్గొజు సంపత్ చారి, బోనాల పరశురాము, గ్రామ సర్పంచ్ నునుగొండ మానస ప్రవీణ్ వార్డు మెంబర్లు రుద్ర రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు