బతుకమ్మ సౌళ్లల్లో వ్యవసాయ మోటార్ చోరీ

25-10-2026 | 07:17pm

50 వేల విలువైన మోటార్‌ను అపహరించిన దుండగులు

పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

​హుజురాబాద్,అక్టోబర్25: (విజయకాంతి) : హుజురాబాద్(Huzurabad) పట్టణంలోని బతుకమ్మ సౌళ్లలో ఓ రైతుకు(Farmer) చెందిన వ్యవసాయ మోటార్(Agricultural motor) ఆదివారం చోరీకి గురైంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం... హుజురాబాద్ పట్టణంలోని మారుతినగర్‌కు చెందిన ఇప్పలపల్లి శంకర్ కు బతుకమ్మ సౌళ్లలోని చెక్ డ్యాం(Check dam) సమీపంలో వ్యవసాయ భూమి ఉంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో శంకర్ తన పొలం వద్దకు వెళ్లగా, అప్పటికే అక్కడ ఉండాల్సిన వ్యవసాయ మోటార్ కనిపించలేదు.

​చుట్టుపక్కల పరిసరాల్లో ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు మోటార్‌ను దొంగిలించినట్లు బాధితుడు నిర్ధారించుకున్నాడు. చోరీకి గురైన మోటార్ విలువ సుమారు రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు ఉంటుందని బాధితుడు పేర్కొన్నాడు. మోటార్ దొంగలించిన దుండగులను గుర్తించి, దానిని రికవరీ చేసి తనకు న్యాయం చేయాలని కోరుతూ హుజురాబాద్ టౌన్ పోలీసులకు బాధితుడు శంకర్ ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వార్తలు