రక్తదానం.. ప్రాణదానంతో సమానం!

25-10-2026 | 07:27pm

* మెగా రక్తదాన శిబిరంలో యువత పెద్దఎత్తున పాల్గొనాలి

ఎస్‌ఐ శ్రీకాంత్‌ గౌడ్‌ పిలుపు

గరిడేపల్లి, అక్టోబర్‌ 25,(విజయక్రాంతి) : రక్తదానం(Blood Donation) చేసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడాలని ఎస్‌ఐ శ్రీకాంత్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో(Police Martyrs' Commemoration Week) భాగంగా జిల్లా ఎస్పీ కే. నరసింహ ఆదేశాల మేరకు మండలంలోని కల్మలచెరువు రోడ్డు చౌరస్తాలో పోలీస్‌ కళాబృందం ఆధ్వర్యంలో రక్తదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్‌ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు.

రక్తదానం ఎంతోమంది ప్రాణాలను కాపాడే గొప్ప సేవ అని పేర్కొన్నారు. అక్టోబర్‌ 26న నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరంలో(Mega Blood Donation Camp) మండలంలోని యువత, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. కార్యక్రమంలో పోలీస్‌ కళాబృందం సభ్యులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు