విమర్శించే ముందు గతాన్ని గుర్తుచేసుకోండి
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడిపై కాంగ్రెస్ నేత చెంచల రాము ధ్వజం
అశ్వాపురం, అక్టోబర్ 25 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీపై(Congress Party) అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఆదివారం మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చెంచల రాము బీఆర్ఎస్ మండల అధ్యక్షుడిపై(BRS Mandal President) మండిపడ్డారు. రాజకీయంగా ఎదగడానికి అవకాశం కల్పించి, మండల అధ్యక్ష పదవితో పాటు ప్రజల్లో గుర్తింపు తెచ్చిన కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సమంజసం కాదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తుమ్మల చెరువుకు(Thummala Cheruvu) సాగునీరు అందించేందుకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కృషితో మల్లెలపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు(Mallelapadu Lift Irrigation Project) పూర్తయి, తుమ్మలచెరువుకు నీరు చేరుతోందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పాయంపై విమర్శలు చేసే ముందు గత పాలనను గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు సహించబోవని హెచ్చరించారు.