ఇందారంలో ఘోర విషాదం

25-10-2026 | 07:36pm

నీటి కుంటలో ముగ్గురి జలసమాధి!

జైపూర్, ( విజయక్రాంతి ) : మంచిర్యాల జిల్లా(Mancherial District) జైపూర్ మండలం ఇందారం గ్రామ శివారులో విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు నీటి కుంటలో(Water pond) దిగిన ముగ్గురు వలస వ్యాపారులు(Traders) లోతు అంచనా వేయలేక నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వ్యాపారం కోసం గ్రామానికి వచ్చి తాత్కాలికంగా నివాసం ఉంటున్న వీరు ఆదివారం మధ్యాహ్నం మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి(Mancherial Government Hospital) తరలించారు. ఈ ఘటనతో ఇందారం గ్రామంలో(Indaram Village) విషాదం అలుముకుంది

మరిన్ని వార్తలు