ఫామ్‌హౌస్‌లో యువకుడి అనుమానాస్పద మృతి
ఘట్ కేసర్, అక్టోబర్ 25 (విజయక్రాంతి) : ఫామ్‌హౌస్‌లో(Farmhouse) పుట్టినరోజు వేడుకలకు(Birthday celebration) వెళ్లిన యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్(Ghatkesar Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ భగాయత్, రిటైర్డ్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సి. ప్రవీణ్ కుమార్ కుమారుడు కృష్ణ కౌండిన్య(Krishna Kaundinya) (21) నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కళాశాలలో(Keshav Memorial College) బీటెక్ పూర్తి చేశాడు.
ఈనెల 24వ తేదీ రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో కృష్ణ కౌండిన్య తన స్నేహితుడు ఘన్కోట్ రిషబ్‌తో కలిసి ఏదులాబాద్‌లోని లివిన్ ఫామ్‌హౌస్ లో జరుగుతున్న మరో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు ఇంటి నుంచి వెళ్లాడు.
మరుసటి రోజు అనగా 25న ఉదయం సుమారు 10:00 గంటలకు రిషబ్ తండ్రి ప్రవీణ్ కుమార్‌కు ఫోన్ చేసి, కృష్ణ కౌండిన్య ఫామ్‌హౌస్‌లో అపస్మారక స్థితిలో పడిపోయాడని, తాము అతడిని ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకోగా అప్పటికే కృష్ణ కౌండిన్య మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని తండ్రి ప్రవీణ్ కుమార్ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి, అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నారు.