విద్యార్థులు శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందించుకోవాలి

23-09-2026 | 07:53pm

జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి

కామారెడ్డి, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): విద్యార్థులు శాస్త్రీయ ఆలోచన  విధానాన్ని పెంపొందించుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాం రెడ్డి(District Science Officer Siddhiram Reddy) అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అర్కిడ్స్ హైస్కూల్లో ఇంధన రంగంలో సుస్థిరతే లక్ష్యం “భారత ఇంధన బాస్కెట్–2047: అవకాశాలు & సవాళ్లు” అనే అంశంపై జిల్లా స్థాయి సైన్స్ సెమినార్‌ను నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు సెమినార్‌లో పాల్గొని భవిష్యత్ భారతదేశ ఇంధన అవసరాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, ఇంధన సంరక్షణ, గ్రీన్ ఎనర్జీ తదితర అంశాలపై తమ అభిప్రాయాలను శాస్త్రీయంగా వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి సిద్ధ రామ్ రెడ్డి మాట్లాడుతూ, 2047 నాటికి భారతదేశాన్ని ఇంధన రంగంలో స్వావలంబన దిశగా తీసుకెళ్లేందుకు పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, ఇంధన పొదుపు, సోలార్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ పవన విద్యుత్తు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులు భవిష్యత్తు భారత దేశ నిర్మాణంలో శాస్త్రవేత్తలుగా ఎదిగి అన్ని రంగాల్లో ముందు ఉంచాలని సూచించారు. సైన్స్ సెమినార్ లో ప్రథమ బహుమతి జడ్పిహెచ్ఎస్ కల్వరాల్ విద్యార్థిని,, ద్వితీయ బహుమతి జడ్పిహెచ్ఎస్ కృష్ణాజివాడి విద్యార్తి, తృతీయ బహుమతి ఆర్కిడ్స్ హైస్కూల్ విద్యార్థి గెలుపొందారు. 

మరిన్ని వార్తలు