సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను కొనసాగించాలి

31-10-2026 | 05:05pm

కామారెడ్డి,(విజయక్రాంతి): సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) ఆశయాలను ప్రతి పౌరుడు కొనసాగించాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(Kamareddy SP Rajesh Chandra) అన్నారు. శనివారం కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రత పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.

దేశంలోని అనేక సంస్థానాలను ఏకం చేసి సమైక్య, బలమైన భారతదేశ నిర్మాణానికి విశేష కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కే. నరసింహారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, సీఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు