పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి
ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరులో ప్రాచీన్ గ్లోబల్ ఆసుపత్రి ప్రారంభం
పటాన్‌చెరు: పేద, మధ్యతరగతి ప్రజలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉండాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం పటాన్‌చెరులో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాచీన్ గ్లోబల్ ఆసుపత్రిని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్‌చెరు ప్రాంతంలో ఆధునిక వైద్య సదుపాయాలతో ఆసుపత్రి ఏర్పాటు కావడం సంతోషకరమన్నారు. ఆసుపత్రి యాజమాన్యం పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు.
కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ వెంకట్ ఆలపాటి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, విజయ్ కుమార్, పాండురంగారెడ్డి, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.